AP News: ఇంటర్లో 60 మార్కులొస్తే 5 వేసి ఫెయిల్ చేసిన లెక్చరర్‌కి స్వల్ప శిక్షా..? కఠిన చర్యలేవి.. | AP Inter student failed with 5 out of 60 marks Controversy: Demand for strict punishment for the teacher who conducted evaluation
అమరావతి, మే 18: ఇటీవల విడుదలైన ఇంటర్మీడియల్ ఫలితాల్లో పలు దారుణాలు వెలుగు చూశాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొందరు లెక్చరర్లు మూల్యాంకనంలో ఘోర తప్పిదాలు చేసి, విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. నిర్లక్ష్యంగా పేపర్లు మూల్యాంకనం చేసిన లెక్చరర్లపై మాత్రం కఠిన చర్యలు ఉండటం లేదు. మూల్యాంకనం ముందు విద్యాశాఖ హడావిడి చేసినప్పటికీ.. ఇప్పుడు మాత్రం తూతూ మంత్రంగా ఇటువంటి వారిపై చర్యలు తీసుకుని చేతులు దులుపుకోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మూల్యాంకనంలో పొరబాట్లు చేస్తే లెక్చరర్లకు భారీ…
