సరదా కోసం వెళ్లి శాశ్వతంగా దూరమయ్యాడు.. అమెరికా విమాన ప్రమాదంలో కర్నూలు వాసి మృతి | Kurnool Youth Dies in Tragic Plane Crash in the US
కర్నూలు, జూన్ 17: అమెరికాలో జూన్ 15న జరిగిన విమాన ప్రమాదంలో కర్నూలు జిల్లా కోసిగి మండలం తుంబిగనూరు గ్రామానికి చెందిన దాట్ల సుబ్రహ్మణ్యం రాజు కుమారుడు సాయి కార్తీక్ వర్మ( 26) దుర్మరణం చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. దాట్ల సుబ్రహ్మణ్యం రాజు, పద్మావతి దంపతుల సొంత గ్రామం కోస్తాంధ్రలోని భీమవరం. కాగా 30ఏళ్ల క్రితం కోసిగి మండలంలోని తుంబిగనూరు వచ్చి స్థిరపడ్డారు. వీరికి ఏకైక కుమారుడు సాయి కార్తీక్ వర్మ సంతానం….
