కడప పోలీసులా మజాకా..! ఇక గంజాయి బాబుల ఆటలు సాగవు..! | Kadapa Police Conduct Rapid Tests to Identify Ganja Users
వాహనాల తనిఖీ అంటే కేవలం డ్రంక్ అండ్ డ్రైవ్ లేదా డాక్యుమెంట్ల వెరిఫికేషన్ మాత్రమే అనుకుంటే ఇకపై పొరపాటే. మత్తు పదార్థాలు, ముఖ్యంగా గంజాయి సేవించి రోడ్లపైకి వస్తే స్పాట్లోనే తాట తీసేందుకు కడప పోలీసులు సరికొత్త అస్త్రాన్ని రంగంలోకి దించారు. సరికొత్త ‘రాపిడ్ డ్రగ్ స్క్రీనింగ్ టెస్ట్ కిట్ల’తో రంగంలోకి దిగిన పోలీసులు.. గంజాయి బాబుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు. కడప నగరంలో గంజాయి విచ్చలవిడిగా హల్చల్ చేస్తుండటం, ముఖ్యంగా యువత ఈ మత్తుకు బానిసలవుతుండటంతో…
