సీఎం సార్.. నన్ను అమ్మేశారు.. కాపాడండి ప్లీజ్ | Telugu Woman Trapped in Kuwait Pleads for Help in Viral Selfie Video tv9d
ఇటీవల కాలంలో బ్రతుకుతెరువుకోసం గల్ఫ్ దేశాలకు వెళ్తున్నవారి సంఖ్య రోజు రోజుకీ ఎక్కువవుతోంది. ఆర్ధిక సమస్యలనుంచి గట్టెక్కవచ్చని, కుటుంబాన్ని చక్కగా పోషించుకోవచ్చని గంపెడాశతో అయినవారిని వదిలి పొట్ట చేతపట్టుకొని అప్పులు చేసుకొని మరీ విదేశాలకు వెళ్తున్నారు. అయితే అక్కడ వారికి ఎదురయ్యే పరిస్థితులు వేరు. పనిచేసే ప్రదేశంలో యజమానుల చేత తీవ్ర వేధింపులకు గురవుతూ…క్షణక్షణం నరకం అనుభవిస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో కొందరు వారి వేధింపులు తాళలేక తమ గోడును ప్రభుత్వాలకు విన్నవించుకుంటూ కాపాడమని వేడుకుంటున్నారు….
