Headlines

తెలుగు అబ్బాయిలంటే ఇష్టం.. పెళ్లి కూడా చేసుకుంటా..! హీరోయిన్ క్రేజీ కామెంట్స్ | Actress Nidhhi Agerwal says that she would marry a Telugu guy


టాలీవుడ్‌లో తన గ్లామర్‌తో పాటు నటనతోనూ గుర్తింపు తెచ్చుకున్న అందాల భామ నిధి అగర్వాల్. వరుసగా సినిమాలు చేస్తున్నప్పటికీ హిట్స్ మాత్రం అందుకోలేకపోతుంది ఈ చిన్నది. పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలో చేస్తున్నప్పటికీ ఈ ముద్దుగుమ్మకు సాలిడ్ హిట్ మాత్రం అందుకోలేకపోతుంది. సినిమాల విషయమే కాకుండా.. ఈసారి తన పెళ్లి గురించి చేసిన ఆసక్తికర వ్యాఖ్యలతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ముఖ్యంగా తెలుగబ్బాయిని పెళ్లి చేసుకుంటారా.? అని అడిగిన ప్రశ్నకు ఆమె ఇచ్చిన సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

బిగ్ బాస్ వల్ల నాపై నీచంగా కామెంట్స్ చేశారు.. తట్టుకోలేక వెక్కి వెక్కి ఏడ్చేశా

ఇటీవల ఓ కార్యక్రమానికి హాజరైన నిధి అగర్వాల్‌ను ఫిలిం రిపోర్టర్స్ ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ప్రశ్నలు అడిగారు. ఈ క్రమంలోనే తెలుగబ్బాయిని పెళ్లి చేసుకుంటారా.? అని ఓ రిపోర్టర్ ప్రశ్నించారు. దీనికి నిధి అగర్వాల్ స్పందిస్తూ.. తాను హైదరాబాద్‌లోనే పుట్టానని, పుట్టుకతోనే తెలుగు అమ్మాయినని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా తెలుగు అబ్బాయిలంటే తనకు ఇష్టమని, బహుశా ఇక్కడి అబ్బాయినే పెళ్లి చేసుకోవచ్చేమో అంటూ నవ్వుతూ సమాధానమిచ్చింది. దీంతో నిధి చేసిన ఈ వ్యాఖ్యలు అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి.

ఇవి కూడా చదవండి



టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్.. స్టార్ హీరోలతో ఎన్నో సినిమాలు.. కానీ చిరంజీవితో మాత్రం నటించలేదు!

సినిమా అవకాశాల కోసం వివిధ ప్రాంతాల్లో ఉండే నటీనటులు తమకు నచ్చిన నగరాల్లో స్థిరపడటం కొత్తేమీ కాదు. అయితే నిధి అగర్వాల్‌కు హైదరాబాద్‌తో ప్రత్యేక అనుబంధం ఉందని ఆమె తాజా వ్యాఖ్యల ద్వారా మరోసారి స్పష్టమైంది. ముంబై నుంచి హైదరాబాద్‌కు మారినట్లు చెబుతూ, ఈసారి బతుకమ్మ పండుగను కూడా జరుపుకోవాలని ఉందని తెలిపింది. నిధి అగర్వాల్ 2017లో వచ్చిన హిందీ చిత్రం ‘మున్నా మైఖేల్’తో సినీ రంగంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత నాగచైతన్య హీరోగా నటించిన ‘సవ్యసాచి’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. రామ్ పోతినేని సరసన నటించిన ‘ఇస్మార్ట్ శంకర్’ ఆమెకు టాలీవుడ్‌లో మంచి గుర్తింపును తీసుకొచ్చింది. ఆతర్వాత వరుసగా సినిమాలు చేస్తుంది.

ఇంతకాలం ఆయనతో సినిమా చేయకుండా ఎందుకు ఉన్నానా అనిపించింది: పూరి జగన్నాథ్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *