Headlines

తిరుచానూరులో విషాదం.. ఏనుగు శ్రీనిధి దాడిలో మావాటి చంద్రశేఖర్ మృతి! | Tiruchanur Temple Tragedy: Mahout Chandrasekhar Dies After Elephant Attack, TTD Probes Incident


తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం వద్ద ఏనుగు దాడి కి గురైన మవాటి చంద్రశేఖర్ మృతి చెందాడు. ఈ నెల 4 సాయంత్రం 6 గంటల సమయంలో వాహన మండపం వద్ద శ్రీనిధి అనే ఏనుగు దాడి చేయగా నాలుగు రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందిన మావాటి చంద్రశేఖర్ కొలుకోలేక పోయాడు. ఉంజల్ సేవకు గజశాల నుంచి ఆలయం వద్దకు ఏనుగును తీసుకొస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. మావాటి చంద్రశేఖర్ ను తొండంతో చుట్టి నేలపై పడేసి దాడి చేసిన ఏనుగు తీవ్రంగా గాయపరిచింది. కిందకు పడేసి కాలుతో తొక్కిన ఏనుగు మావాటి చంద్రశేఖర్ ను తీవ్రంగా గాయపరచడంతో స్విమ్స్ ఆసుపత్రికి తరలించి అధికారులు వైద్యం అందించారు.

4 రోజులపాటు స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందిన మావాటి చంద్రశేఖర్ నిన్న రాత్రి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మావాటి చంద్రశేఖర్ ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఆరా తీసిన టిటిడి ఉన్నతాధికారులు మెరుగైన వైద్య సేవలు అందించే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకపోయింది. ఇక, ఏనుగు దాడికి గురై మావాటి చంద్రశేఖర్ మృతి పై భార్య ఫిర్యాదు మేరకు తిరుచానూరు పీఎస్ లో కేసు నమోదు అయ్యింది.

14 ఏళ్లుగా ఆలనా పాలన చూసిన మావాటి.

తిరుచానూరు పద్మావతి అమ్మ వారి ఆలయం వద్ద హాల్ చల్ చేసి మావాటి ని పొట్టన పెట్టుకున్న దాదాపు 14 ఏళ్లు గా తిరుచానూరు లోని గజశాలలోనే ఉంది. అమ్మవారి సేవలో తరిస్తున్న17 ఏళ్ల వయస్సు ఉన్న శ్రీనిధి అనే ఏనుగు ను 14 ఏళ్లుగా చంద్రశేఖర్ మచ్చిక చేసుకొని సేవలు చేస్తున్నట్లు టీటీడీ చెబుతోంది. అయితే, అదే ఏనుగు తొండంతో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డ మావాటి చంద్రశేఖర్ ఆసుపత్రి పాలై ప్రాణాలు వదిలాడు.

ఇవి కూడా చదవండి



రోజూ మాదిరిగానే తిరుచానూరు లోని గజశాల నుంచి ఆలయం వరకు ఏనుగు తీసుకొచ్చిన మావాటీ ఏనుగును అదుపు చేసే సమయంలోనే దాడికి గురైయ్యాడు. మావాటి చంద్రశేఖర్ ను తొండంతో చుట్టి విసిరి వేసిన ఏనుగు కాలుతో తొక్కేయడంతో తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. భక్తులు స్థానికులను భయభ్రాంతులకు గురిచేసిన ఏనుగు అలా ప్రవర్తించడానికి కారణం పై టీటీడీ అధికారులు ఆరా తీశారు.

అదే కారణమట..

పదిహేడేళ్ల వయసున్న శ్రీనిధి ఏనుగు ఎందుకలా ప్రవర్తించిందన్న దానిపై టిటిడి గోశాల అధికారులు ఆరా తీశారు. ఏనుగు ఆరోగ్య పరిస్థితిని పరీక్షించిన వైద్యులు ఏనుగు మదపు సమయంలో ఇలాంటి సమస్య కు గురైనట్లు భావిస్తున్నారు. హార్మోన్లు (టెస్టోస్టెరాన్) విపరీతంగా పెరిగే సహజమైన సమయంలోనే ఏనుగు లో ఇలాంటి ప్రవర్తన ఉంటుందని గుర్తించారు. ఈ సమయంలో ఏనుగులు చాలా దూకుడుగా కోపంగా ప్రవర్తిస్తాయని చెబుతున్న వైద్యులు ప్రతి ఏటా 2 నుండి 3 సార్లు ఆడ ఏనుగుల్లో ఇలాంటి సమస్య వస్తుందంటున్నారు. ఇలాంటి సమయంలో పది రోజులపాటు వాటి ప్రవర్తనలో మార్పు ఉంటుందని వైద్యులు స్పష్టం చేస్తుండగా, మరోవైపు శ్రీనిధి ఏనుగు ను సంరక్షిస్తున్న మావాటి చంద్రశేఖర్ కూడా ఏనుగు ప్రవర్తనలో మార్పును గుర్తించారు. గత కొద్ది రోజులుగా ఏనుగు తిరగబడుతోందని భార్యతో చెప్పినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి కూడా మావాటి చంద్రశేఖర్ తీసుకెళ్లినట్లు భార్య చెబుతోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *