Headlines

స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం స్పష్టత.. కేబినెట్‌ నిర్ణయమిదే.. | AP government clarifies on BC reservation Quotas in local body elections, Cabinet key decisions


ఆంధ్రప్రదేశ్ కేబినెట్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.. డెడికేటెట్ కమిషన్ సర్వే ప్రకారం స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు ఇవ్వనున్నట్లు తెలిపింది. కొన్ని స్థానాల్లో ముందు తాము ప్రకటించిన 34 శాతం కంటే ఎక్కువ రిజర్వేషన్లు దక్కుతున్నాయని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. మేయర్లకు 35.29 బీసీ రిజర్వేషన్లు దక్కుతాయని స్పష్టంచేశారు. మీడియాతో మాట్లాడిన మంత్రి అచ్చెన్నాయుడు బీసీలకు దక్కబోయే రిజర్వేషన్ల వివరాలు ప్రకటించారు..

అర్బన్ వార్డుల్లో 32.78 శాతం రిజర్వేషన్లు..

మున్సిపల్ చైర పర్సన్స్‌కు 33.02 శాతం..

గ్రామపంచాయతీల్లో వార్డులకు 26.73 శాతం

సర్పంచ్‌లకు 27.95 శాతం..

MPTCలకు 25.55 శాతం, MPP 24.60 శాతం బీసీ రిజర్వేషన్లు

ZPTCలకు 24.60 శాతం, జెడ్పీ చైర్మన్లకు 23.08 శాతం రిజర్వేషన్లు ఇవ్వనున్ట్లు తెలిపారు.

కూటమి ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేయదు అన్న అచ్చెన్నాయుడు.. ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడైనా రావచ్చు, నిర్వహణకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని.. స్పష్టంచేశారు. పార్టీ పరంగా 34 శాతం రిజర్వేషన్లు ఇస్తామని అచ్చెన్నాయడు తెలిపారు.

కాగా.. అంతకుముందు 34 శాతం బీసీ కోటా కోసం ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ నేపథ్యంలో స్థానిక ఎన్నికల్లో బీసీలకు వర్తించే రిజర్వేషన్లు, ఎన్నికల నిర్వహణపై తదుపరి నిర్ణయాలపై ఆసక్తి నెలకొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *