Headlines

మానవత్వం చాటుకున్న టీచర్‌ విద్యార్ధిని వీపుపై మోస్తూ 6 కి.మీ. | Teacher Carries Ailing Student 6 km on Her Back to Save Her Life in Andhra Pradesh video – Viral Videos in Telugu

ఉపాధ్యాయులు విద్యార్ధులను కన్నబిడ్డల్లా చూసుకోవాలి అంటారు. ఎందుకంటే తల్లిదండ్రుల తర్వాత పిల్లలకు అంతటి భరోసా.. రక్షణ దొరికేది గురువు దగ్గరే. అందుకే తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నారు. తల్లిదండ్రుల తర్వాత గురువుకే అంతటి స్థానాన్ని ఇచ్చారు. ఆ స్థానాన్ని అక్షరాలా నిజం చేసి చూపించారు ఓ టీచర్‌. ఆపదలో ఉన్న విద్యార్థిని ప్రాణాలు కాపాడేందుకు ఒక ప్రభుత్వ పాఠశాల వార్డెన్ కం టీచర్‌.. చేసిన పోరాటం ప్రతి ఒక్కరినీ కదిలిస్తోంది. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం…

Read More

Vizianagaram: ప్రభుత్వ ఆసుపత్రిలో ఏఎస్సై వీరంగం.. ల్యాబ్ అసిస్టెంట్‌పై దాడి | Tension at Vizianagaram Government Hospital After Parking Dispute Involving AR ASI

విజయనగరం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో శుక్రవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏఆర్ ఏఎస్సై సోమేశ్వరరావుకి, ఆసుపత్రి ల్యాబ్ అసిస్టెంట్ భాగ్యరావుకి మధ్య పార్కింగ్ విషయంలో స్వల్ప వివాదం చోటుచేసుకుంది. అది కాస్తా ముదిరి సోమేశ్వరరావు ల్యాబ్ అసిస్టెంట్ పై దాడికి దిగాడు. ఆ సమయంలో అడ్డుకునేందుకు ప్రయత్నించిన వైద్యులపైనా సోమేశ్వరరావు దురుసుగా ప్రవర్తించాడు. వివాదం సమయంలో ఏఎస్సై సోమేశ్వరరావు తనను ఎవరూ ఏమీ చేయలేరని, తాను పోలీసు అధికారినని చెబుతూ ఆసుపత్రి సిబ్బందిని బెదిరించినట్లు సిబ్బంది చెప్తున్నారు….

Read More

వరుస నేరాలకు చెక్.. ముగ్గురిపై పీడీ యాక్ట్, నేరస్థులకు ఎస్పీ స్ట్రాంగ్ వార్నింగ్! | Vizianagaram Police Crack Down on Repeat Offenders: PD Act Invoked Against Three Habitual Criminals

విజయనగరం జిల్లాలో వరుస నేరాలకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపారు. వరుసగా దొంగతనాలు, ఇతర నేరాలకు పాల్పడుతున్న అలవాటు ఉన్న నేరస్థులపై కఠిన చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా వేపాడ మండలానికి చెందిన ముగ్గురు వ్యక్తులపై ప్రివెంటివ్ డిటెన్షన్ (పీడీ) యాక్ట్ అమలు చేసి విశాఖపట్నం కేంద్ర కారాగారానికి తరలించారు. బొద్దాం గ్రామానికి చెందిన మహ్మద్ అహ్మద్ (26), పాటూరు గ్రామానికి చెందిన కర్రి యోగేంద్ర (28), రుద్ర బంగారునాయుడు పలు చోరీ కేసుల్లో నిందితులుగా ఉన్నారు….

Read More

Andhra News: లవ్వంటూ.. డాక్టర్‌కు పదేపదే మెసేజ్‌లు.. సీన్‌కట్‌చేస్తే.. ఇదీ పరిస్థితి | Vizianagaram Doctor Harassment: Man Arrested for Stalking via Phone and Messages

విజయనగరం జిల్లా రాజాంలో ఓ మహిళా వైద్యురాలిని ప్రేమ పేరుతో పదేపదే వేధించిన ఆకతాయిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. తెర్లాం మండలానికి చెందిన బాధితురాలు బొబ్బిలి జంక్షన్‌లో క్లినిక్ నిర్వహిస్తున్నారు. ఆ సమీపంలోనే షాపు నిర్వహిస్తున్న పవన్ అనే వ్యక్తి.. క్లినిక్‌ బోర్డు పై ఉన్న నంబర్‌ను సేకరించి తరచూ ఫోన్ కాల్స్ చేయడంతో పాటు ప్రేమ పేరుతో మెసేజ్‌లు చేయడం స్టార్ట్ చేశాడు. పలుమార్లు హెచ్చరించినప్పటికీ అతని ప్రవర్తన మార్చుకోలేదు. దీంతో వైద్యురాలు…

Read More