మనిషి శరీర భాగాలతో క్షుద్రపూజలు… సైకోలుగా మారుతున్న యువకులు.. అమావాస్యకు ముందు కలకలం | Narasaraopet Occult Murder Case: Man Allegedly Kills Sleeping Victim and Removes Body Parts for Black Magic Rituals video – Viral Videos in Telugu
శాస్త్ర సాంకేతిక రంగాల్లో మానవుడు దూసుకుపోతున్నాడు. రోజు రోజుకీ టెక్నాలజీ ఎంతగానో పెరుగుతోంది. నిరక్షరాసులు, మారుమూల ప్రాంతాల ప్రజలు సైతం టెక్నాలజీని అందిపుచ్చుకొని ముందుకుసాగుతున్నారు. అలాంటి ఈ కాలంలో కూడా, కొందరు మూఢనమ్మకాల ఊబిలో కూరుకుపోయి.. కంటికి కనిపించని ‘శక్తుల’ కోసం మనుషుల ప్రాణాలు తీసే దారుణాలు సమాజాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. మంత్రాలు, క్షుద్ర పూజలు, అద్భుత శక్తులు వస్తాయనే పిచ్చి నమ్మకాలతో మనుషులను బలిఇచ్చే మూర్ఖత్వం ఇంకా మనుగడలో ఉందనడానికి పల్నాడు జిల్లాలో వెలుగుచూసిన ఈ…
