ఎల్నినోతో టమోటా రైతుల విలవిల.. ధర ఉన్నా.. ఎండల దెబ్బకు దిగుబడి ఢమాల్! | Kharif Tomato Crisis: El Nino Wreaks Havoc on Chittoor and Annamayya District Yield Drought Impact
ఎల్ నినో ప్రభావం ఉమ్మడి చిత్తూరు జిల్లా టమోటా రైతాంగాన్ని చావు దెబ్బతీసింది. ఒక సహజ వాతావరణ మార్పు టమోటా సాగు చేసిన రైతులను నిండా మంచింది. ఉష్ణోగ్రతలు, గాలుల్లో మార్పు లకు కారణమైన ఎల్ నినో రుతుపవనాలను బలహీనపడేలా చేసింది. దీంతో వర్షపాతం తగ్గి కరువు పరిస్థితులకు కారణమైన ఎన్ నీనో టమోటా సాగు చేసిన ఖరీఫ్ రైతుకు నష్టాలను మిగిల్చింది. ధర ఉన్నా దిగుబడి లేక కొత్త కష్టాన్ని తీసుకొచ్చింది. ఖరీఫ్ రైతును కుంగదీసింది…
