UPSC సివిల్స్‌లో 24వ ర్యాంకు.. కేవలం రూ.45 వేల కోచింగ్‌తో ప్రిలిమ్స్‌కు సన్నద్ధత! ఇమ్మాడి పృథ్వీ సక్సెస్ సీక్రెట్స్ ఇవే | Just 2.5 Months of Coaching for Rs 45,000: UPSC Rank 24 Immadi Prithvi Shares His Strategy
UPSC సివిల్స్ కోచింగ్ కోసం ఢిల్లీలోని విజన్ ఐఏఎస్‌లో శిక్షణ తీసుకున్నట్లు పృథ్వీ తెలిపారు. తనకు రెండున్నర నెలల ప్రిలిమ్స్ ఫోకస్డ్ ప్రోగ్రామ్‌కు రూ.45,000 ఫీజు అయినట్లు వెల్లడించారు. ఈ కోర్సు చాలా తక్కువ వ్యవధిలో పూర్తయ్యేలా రూపొందించారని, ప్రిలిమ్స్ పరీక్షకు అవసరమైన ముఖ్యమైన అంశాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారని వివరించారు. సమయం తక్కువగా ఉన్నప్పటికీ, పరీక్షకు ఉపయోగపడే కీలక అంశాలను క్రమబద్ధంగా చదవడానికి ఈ కోర్సు సహాయపడిందని చెప్పారు. తన అనుభవంలో ఇది ఉపయోగకరంగా ఉందని…
