ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ.. గోదావరి-కావేరి లింక్‌పై కీలక ప్రతిపాదనలు! | AP CM Chandrababu Meets PM Modi: Godavari Cauvery Link, AP Development Discussed in Delhi
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం (అక్టోబర్ 08) ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. రాష్ట్ర అభివృద్ధి, ఆర్థిక పరిస్థితి, నీటిపారుదల, మౌలిక వసతులు, కరువు పరిస్థితులు సహా పలు కీలక అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా గోదావరి–కావేరి నదుల అనుసంధానాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు కేంద్రం చొరవ తీసుకోవాలని కోరారు. ప్రధాని మోదీకి చంద్రబాబు శుభాకాంక్షలు భేటీ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల పాలనా ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న…
