అక్కడ వద్దనుకుంటే.. మరో చోట స్థలం కేటాయింపు.. వారికి ఏపీ ప్రభుత్వం సూపర్ గుడ్న్యూస్ | AP Govt Key Decision on Jagananna Colonies: Ministerial Committee Set Up, 45 Day Deadline
జగనన్న కాలనీల్లోని ఇళ్ల స్థలాలపై కూటమి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. అక్కడ ప్లాట్లు పొందిన లబ్ధిదారులు ఇళ్లు కట్టుకునేందుకు సుముఖంగా ఉన్నారా లేదో తెలుసుకోవాలని, అక్కడ ప్లాట్లు వద్దనుకున్న వారికి మరో ప్రాంతంలో స్థలాల కేటాయింపును పరిశీలించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు లబ్ధిదారులు తమ అభిప్రాయాన్ని తెలియజేయాలని నోటీసులు కూడా పంపనున్నారు. తాజాగా ఈ అంశంపై మంత్రులతో సమావేశమైన సీఎం చంద్రబాబు, వారికి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ జగనన్న కాలనీల్లో ఇళ్ల…
