సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ నాగమణి మిస్సింగ్ మిస్టరీ.. భర్త సంచలన ప్రకటన.. అసలేం జరిగింది? | Social Media Influencer Nagamani Missing for Months; Husband Offers Rs.1 Lakh Reward for Her Whereabouts
డిజిటల్ మీడియా ప్రపంచంలో రోజుకో కొత్త ఘటన వైరల్ అవుతుంటుంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ పాపులర్ అయిన సెలబ్రిటీల జీవితాల్లో జరిగే పరిణామాలు ఎప్పుడూ చర్చనీయాంశమవుతుంటాయి. తాజాగా అన్యోన్యంగా సాగిపోతున్న ఓ ఇన్ఫ్లుయెన్సర్ దంపతుల జీవితంలో చోటుచేసుకున్న అనూహ్య పరిణామం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. కేవలం నాలుగు నెలల పసిపాపను వదిలి ఇన్ఫ్లుయెన్సర్ నాగమణి అదృశ్యమైన ఉదంతం ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసింది. కాకినాడ జిల్లా కోటనందూరు మండలం బొద్దవరం గ్రామానికి చెందిన బద్ధ…
