రాజమండ్రిలో తొలిసారి కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్.. అవయవదానంతో నలుగురికి పునర్జన్మనిచ్చిన అడపా సుధీర్ | Rajahmundry Witnesses First Kidney Transplantation as Adapa Sudheer’s Organ Donation Saves Four Lives
రాజమండ్రి: మానవత్వానికి నిలువెత్తు నిదర్శనంగా, మరణంలోనూ మరికొందరి జీవితాల్లో వెలుగులు నింపే మహత్తర కార్యానికి రాజమండ్రిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి వేదికైంది. రాజమండ్రిలోని ప్రైవేట్ ఆస్పత్రిలో తొలిసారిగా కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ (మూత్రపిండ మార్పిడి) ప్రక్రియ చేపట్టారు. ఇదే సమయంలో బ్రెయిన్ డెడ్ అయిన అడపా సుధీర్ అవయవదానం ద్వారా నలుగురు రోగుల ప్రాణాలను కాపాడటం సమాజానికి స్ఫూర్తిదాయకంగా నిలిచింది. అనుకోని పరిస్థితుల్లో బ్రెయిన్ డెడ్ అయిన అడపా సుధీర్ కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలోనూ గొప్ప మానవతా…
