Andhra: ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురు.. 34% బీసీ రిజర్వేషన్ల పిటిషన్ను కొట్టేసిన సుప్రీంకోర్టు | ap bc reservations supreme court local body elections
ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నానికి సుప్రీంకోర్టులో నిరాశ ఎదురైంది. ఈ అంశంపై ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ (SLP)ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. బీసీ రిజర్వేషన్లను రద్దు చేస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకునేందుకు నిరాకరించింది. జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ షీల్ నాగు నేతృత్వంలోని ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకుంది. 50 శాతం రిజర్వేషన్ల పరిమితిపై అభ్యంతరం స్థానిక…
