Headlines

OTT: ఇదెక్కడి సిరీస్ రా మావ..! రొమాంటి వెబ్ సిరీస్.. ఒంటరిగా చూడటమే బెటర్.. | Don’t miss the Romantic Series that is trending on OTT, It Is Tribhuvan Mishra CA Topper


ఓటీటీలో రొమాంటిక్ సినిమాలు, వెబ్ సిరీస్‌లకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. థియేటర్లలో విడుదలైన సినిమాలు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లపైకి ఎప్పుడు వస్తాయా అని ఎదురుచూసే ప్రేక్షకులు ఎంతోమంది ఉన్నారు. ముఖ్యంగా ఇంట్లోనే కూర్చొని తమకు నచ్చిన సినిమాలు, సిరీస్‌లను చూసేందుకు ఓటీటీని ఎంచుకుంటున్నారు. ఈ క్రమంలో విభిన్నమైన కథలు, బోల్డ్ కంటెంట్‌తో రూపొందిన వెబ్ సిరీస్‌లు కూడా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అలాంటి సిరీస్‌లలో ఒకటి ఇప్పుడు ఓటీటీని షేక్ చేస్తుంది. ఈ సిరీస్ ఒంటరిగా చూడటమే బెటర్. ఆ సిరీస్ మరేదో కాదు.. త్రిభువన్ మిశ్రా సీఏ టాపర్. నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉన్న ఈ హిందీ వెబ్ సిరీస్ కథ, ఇందులోని సన్నివేశాలు, టైటిల్ కారణంగా గతంలో చర్చకు వచ్చింది. అసలు ఈ సిరీస్ కథేంటి.? ఎందుకు విమర్శలు ఎదుర్కొంది.? ఇప్పుడు తెలుసుకుందాం.

బిగ్ బాస్ వల్ల నాపై నీచంగా కామెంట్స్ చేశారు.. తట్టుకోలేక వెక్కి వెక్కి ఏడ్చేశా

ఈ వెబ్ సిరీస్‌లో ప్రధాన పాత్రలో నటించిన వ్యక్తి త్రిభువన్ మిశ్రా. అతను చార్టర్డ్ అకౌంటెన్సీ లో ప్రతిభ చూపించి, ఆర్థికంగా స్థిరపడిన వ్యక్తిగా కనిపిస్తాడు. అయితే అతని జీవితం అనుకున్నంత సాఫీగా సాగదు. వ్యక్తిగత, ఆర్థిక పరిస్థితులు అతని జీవితాన్ని ఊహించని దిశలోకి తీసుకెళ్తాయి. డబ్బు సంపాదించాలనే ఆలోచనతో అతను ఎంచుకునే మార్గం కథలో కీలకంగా మారుతుంది. ఈ క్రమంలో అతని జీవితంలో ఎదురయ్యే పరిణామాలు, సంబంధాలు, సమస్యల చుట్టూ కథ ముందుకు సాగుతుంది.

టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్.. స్టార్ హీరోలతో ఎన్నో సినిమాలు.. కానీ చిరంజీవితో మాత్రం నటించలేదు!

త్రిభువన్ మిశ్రా సీఏ టాపర్ సిరీస్‌లోని బోల్డ్ సన్నివేశాలు ప్రేక్షకుల మధ్య చర్చకు దారితీశాయి. కథలోని కొన్ని అంశాలు, పాత్రల చిత్రీకరణపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా సీఏ వంటి గౌరవప్రదమైన వృత్తిని టైటిల్‌లో ఉపయోగించడంపై కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అయితే ఈ సిరీస్‌ను కేవలం రొమాంటిక్ కథగా మాత్రమే చూడలేం. ఇందులో క్రైమ్, కామెడీ, డ్రామా అంశాలు కూడా ఉన్నాయి. కథలోని పాత్రలు తీసుకునే నిర్ణయాలు, వాటి వల్ల ఎదురయ్యే పరిణామాలే కథనానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. ఈ సిరీస్‌లో అడల్ట్ థీమ్స్, బోల్డ్ సన్నివేశాలు ఉండటంతో కుటుంబ సభ్యులతో కలిసి చూడకపోవడం మంచిది. రొమాన్స్‌తో పాటు క్రైమ్, కామెడీ, డ్రామా కలగలిపిన కథలను ఇష్టపడేవారికి త్రిభువన్ మిశ్రా సీఏ టాపర్ మంచి చాయిస్.. నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉన్న హిందీ వెబ్ సిరీస్ అస్సలు మిస్ అవ్వకండి.

ఇవి కూడా చదవండి



ఇంతకాలం ఆయనతో సినిమా చేయకుండా ఎందుకు ఉన్నానా అనిపించింది: పూరి జగన్నాథ్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *