Headlines

Caste Certificate: జస్ట్ రూ.40 చెల్లిస్తే చాలు.. వాట్సప్‌లోనే క్యాస్ట్ సర్టిఫికేట్.. సులువుగా పొందండిలా.. | AP WhatsApp Governance: Get Caste Certificate on WhatsApp for Just Rs. 40, Check Application Process and Required Details


ఏపీ ప్రజలకు కూటమి సర్కార్ గుడ్ న్యూస్ అందించింది. మన మిత్ర వాట్సప్ గవర్నెన్స్ ద్వారా ప్రజలు డిజిటల్ సేవలను అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ సేవల ద్వారా ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లకుండానే వాట్సప్‌లోనే ధృవీకరణ పత్రాలు, బుకింగ్ సేవలు పొందవచ్చు. సర్టిఫికేట్ జారీ కాగానే వాట్సప్‌లోనే డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఇప్పటికే మీకు ఏదైనా సర్టిఫికేట్ జారీ అయి ఉంటే.. డౌన్‌లోడ్ కూడా చేసుకునే వీలుంది. అయితే మన మిత్ర వాట్సప్‌ సేవల్లో మరో సదుపాయాన్ని ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. అదే కుల ధృవీకరణ పత్రాల జారీని మరింత సులువు చేయడం. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో ఈ సర్టిఫికేట్ జారీ ప్రక్రియ మరింత వేగవంతం కానుంది. మన మిత్ర ద్వారా కుల ధృవీకరణ పత్రం పొందే ప్రక్రియను మరింత సులభతరం చేసింది.

కేవలం రూ.40 చెల్లిస్తే చాలు..

వాట్సప్‌లోనే కుల ధృవీకరణ పత్రం ఈజీగా పొందవచ్చు. మన మిత్ర వాట్సప్ గవర్నెన్స్ నెంబర్ 9552300009కు సేవ్ చేసుకోవాలి. వాట్సప్ ఓపెన్ చేసి ఆ నెంబర్‌కు హాయ్ అని మెస్సేజ్ చేయాలి. కేటగిరీలో రెవెన్యూ సర్వీసులను ఎంచుకోవాలి. అందులో రీఇష్యూయెన్స్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్స్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత ఆధార్ నెంబర్ నమోదు చేసి ఓటీపీ వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేయాలి. ఆ తర్వాత అప్లికేషన్‌లో మీ వివరాలు నింపి సబ్మిట్ చేయాలి. ఆ తర్వాత రూ.40 ఆన్ లైన్ ద్వారా చెల్లిస్తే కుల ధృవీకరణ పత్రాన్ని డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ద్వారా ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండానే క్యాస్ట్ సర్టిఫికేట్ పొందవచ్చు. దీని వల్ల స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయాలు, మీ సేవా కేంద్రాలను సందర్శించాల్సిన అవసరముండదు. దీంతో కుల ధృవీకరణ పత్రం అవసరం ఉన్నవారు ఈ విధానంలో దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది.

161 రకాల సేవలు

కాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాట్సప్ గవర్నెన్స్ సేవలను ప్రారంభించింది. తొలుత కొన్ని ప్రభుత్వ సేవలను అందుబాటులోకి తీసుకురాగా.. వీటిని విడతల వారీగా విస్తరిస్తోంది. ప్రస్తుతం వెయ్యికిపైగా ప్రభుత్వ సేవలు వాట్సప్ ద్వారా పొందే అవకాశముంది. 161 రకాల పౌర సేవలను అందిస్తోంది. ఆర్టీసీ టికెట్ల బుకింగ్, దేవాలయాల్లో దర్శన టికెట్లు బకింగ్, పర్యాటక ప్రాంతాల్లో టికెట్ల బుకింగ్ వంటి సేవలు కూడా ఇందులో అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం ఎక్కువమంది వాట్సప్ వినియోగిస్తున్నారు. దీని వల్ల వేరే వెబ్ సైట్స్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేకుండా వాట్సప్‌లోనే అన్నీ ప్రభుత్వ సేవలు పొందవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *