Ration Cards: ఏపీలో రేషన్ కార్డు ఉన్నవారికి భారీ గుడ్ న్యూస్.. ప్రభుత్వం నుంచి దీపావళి గిఫ్ట్.. పండుగే పండుగ | AP Ration Card Holders Good News: Toor Dal at 100, Wheat Flour at 25, Palm Oil at 125


ఏపీలో రేషన్ కార్డు ఉన్నవారికి భారీ గుడ్ న్యూస్. కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్ కార్డుదారులకు దీపావళి గిఫ్ట్ ప్రకటించింది. దీపావళి కానుకగా ప్రజలకు అతి తక్కువ ధరకే నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని సీఎం చంద్రబాబు తాజాగా కీలక ఆదేశాలు జారీ చేశారు. రేషన్ షాపుల ద్వారా బియ్యంతో పాటు కందిపప్పు, గోధుమ పిండి, పామాయిల్ అతి తక్కువ ధరకే సామాన్య, మధ్యతరగతి ప్రజలకు అందించనున్నారు. ప్రస్తుతం ఎల్‌నివో ప్రభావం వల్ల పంట ఉత్పత్తి తగ్గిపోవడంతో బయట మార్కెట్లలో నిత్యావసర సరుకుల ధరలు భారీగా పెరుగుతున్నాయి. దీంతో సామాన్యులకు ఇది భారంగా మారగా.. ఇంటి బడ్జెట్ పెరుగుతోంది. పండుగ సందర్భంగా ఇంట్లోకి కిరాణా సరుకుల అవసరం ఎక్కువగా ఉంటుంది. పెరిగిన ధరలతో వీటిని కొనాలంటే సామాన్యులకు పెనుభారం మారుతున్నాయి.

రేషన్ షాపుల్లో చౌక ధరకే నిత్యావసర సరుకులు..

ఈ క్రమంలో దీపావళి సందర్భంగా రేషన్ షాపుల్లో కందిపప్పు, గోధుమ పిండి, పామాయిల్ అందించాలని చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు సబ్సిడీ ధరలను కూడా ఫిక్స్ చేశారు. కిలో కందిపప్పు రూ.100కు అందించనుండగా.. గోధుమ పిండి రూ.25, పామాయిల్ లీటర్ రూ.125కే ఇవ్వనున్నారు. టెండర్ల ద్వారా పామాయిల్ సేకవరించి ప్రభుత్వం పంపిణీ చేయనుంది. దీంతో పాటు ఫైన్, సూపర్ ఫైన్ రకం బియ్యంను కూడా ప్రభుత్వం తక్కువ ధరకు అందించనుంది. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో సన్నబియ్యం కిలో రూ.100 పలుకుతోంది. దీంతో మొబైల్ వాహనాల ద్వారా ధరణి బ్రాండ్‌తో కిలో పైన్ బియ్యాన్ని రూ.49, సూపర్ ఫైన్ బియ్యాన్ని రూ.50కే విక్రయించనున్నారు. ఇప్పటికే రైతు బజార్లలో సన్నబియ్యంను ప్రజలకు తక్కువ ధరకు ప్రభుత్వం అందిస్తోంది. అలాగే కిలో ఉల్లిని రూ.35కే పంపిణీ చేస్తోంది. త్వరలో 800 టన్నలు ఉల్లిని కూడా సబ్సిడీ ధరలకు అందించనుంది.

బీపీటీ బియ్యం రూ.66కే పంపిణీ

బీపీటీ స్టీమ్ రైస్ బియ్యం కిలో రూ.66, సాధారణ స్టీమ్ రకం బియ్యం రూ.47కి మించకుండా విక్రయించేలా మిల్లర్ల, హోల్ సేల్ అసోసియేషన్లతో ప్రభుత్వ అధికారులు చర్చించారు. దీంతో మిల్లర్లు దీనికి అంగీకరించారు. తాజాగా ఏపీలోని నిత్యావసర సరుకుల ధరలపై చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా బియ్యం అక్రమంగా తరలిపోకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇందుకోసం చెక్ పోస్టులు, టోల్ గేట్ల వద్ద నిఘా పెంచాలని సూచించారు. అలాగే మార్కెట్ సెస్సు భారాన్ని తగ్గించే విధంగా చూడాలన్నారు. దీపావళి రానున్న క్రమంలో నిత్యావసర వస్తువుల ధరలు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *