కోవూరు: సమాజ సేవలో భాగంగా కోవూరు పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ (SVSCN) జాతీయ సేవా పథకం (NSS) విభాగం మరియు పోలీస్ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో భారీ ఉచిత రక్తదాన శిబిరం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి పోలీస్ సిబ్బంది, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు మరియు స్థానిక యువత విశేషంగా హాజరై స్వచ్ఛందంగా రక్తదానం చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ప్రముఖులు “రక్తదానం – ప్రాణదానంతో సమానమని”, ఒకరి రక్తదానం అత్యవసర పరిస్థితుల్లో ఉన్న పలువురి ప్రాణాలను కాపాడుతుందని తెలిపారు. NSS ప్రోగ్రామ్ ఆఫీసర్ డి. రవికుమార్ మాట్లాడుతూ.. యువత మరియు విద్యార్థులు సామాజిక బాధ్యతగా ఇలాంటి సేవా కార్యక్రమాల్లో ముందుండటం అభినందనీయమని అన్నారు.
పోలీస్ డిపార్ట్మెంట్ సహకారంతో ఈ శిబిరాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులో కూడా తమ SVSCN ఇంజనీరింగ్ కళాశాల తరఫున ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని పేర్కొన్నారు.
డాక్టర్ గుణశేఖర్ నేతృత్వంలోని వైద్య బృందం రక్తదాతలకు తగిన పరీక్షలు నిర్వహించి, అన్ని భద్రతా ప్రమాణాలు పాటిస్తూ రక్తాన్ని సేకరించారు. సేకరించిన రక్తాన్ని అత్యవసర చికిత్స పొందుతున్న రోగుల నిమిత్తం బ్లడ్ బ్యాంక్‌కు అందజేశారు. రక్తదానం చేసిన వారందరికీ అల్పాహారం మరియు ప్రశంసా పత్రాలను అందజేశారు.

- ప్రోగ్రామ్ ఆఫీసర్ డి. రవికుమార్ గారి మార్గదర్శకంలో స్టూడెంట్ కోఆర్డినేటర్లు సతీష్, ఫణికుమార్, సుప్రియ తమ NSS వాలంటీర్ల బృందంతో కలిసి ప్రణాళికాబద్ధంగా ఈ డ్రైవ్‌ను నిర్వహించారు.
