అర్నబ్ తుఫాన్ దెబ్బకు ఏపీ అతలాకుతలం.. ఏ పంటకు ఎంత పరిహారమంటే..? లైవ్ వీడియో | Arnab Cyclone Damage in Andhra Pradesh Live Video: Government Announces Compensation for Farmers and Victims


ఏపీపై అర్నబ్ తుఫాన్ తీవ్ర ప్రభావం చూపించింది. 75 మండలాలు, 852 గ్రామ పంచాయతీలపై తుఫాన్ ప్రభావం ఉందని అధికారులు తెలిపారు. 2.24 లక్షల హెక్టార్లలో పంటలు నీటమునిగాయి. 14 జిల్లాల్లో 3.45లక్షలమంది రైతులపై తుఫాన్ ప్రభావం ఉంది. పశ్చిమగోదావరిలో 82శాతం వరి పంట నీటమునిగింది. కోనసీమలో 74%, కాకినాడలో 48% వరి పంటకు నష్టం వాటిల్లింది. ఎక్కడికక్కడ విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టారు. అర్నబ్ తుఫాన్ నష్టాలకు.. ఏపీ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా.. ఐదుగురు మృతి చెందినట్లు గుర్తించగా.. వారి కుటుంబాలకు రూ.5లక్షల పరిహారం ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దెబ్బతిన్న ఇళ్లు 180గా గుర్తించారు. ఒక్కో ఇంటికి 10వేల చొప్పున పరిహారం అందించనున్నారు. వరి 2లక్షల 9వేల 460 హెక్టార్లలో దెబ్బతిన్నది గుర్తించారు. వరికి హెక్టార్‌కు రూ.25వేలు పరిహారం ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది.

ఉద్యాన పంటల అంచనా కొనసాగుతోంది. పత్తి, చెరకుకు హెక్టార్‌కు రూ.25వేలు, అరటి, పసుపు పంటలకు హెక్టార్‌కు రూ.35వేలు, తమలపాకుల తోటలకు హెక్టార్‌కు రూ.75వేలు ఇస్తామని సర్కార్ ప్రకటించింది. మిరప, బొప్పాయి, టమాటా, ఉల్లి హెక్టారుకు రూ.25వేల నుంచి రూ.35వేలు అందించనుంది. మామిడి, నిమ్మ, దానిమ్మ, సపోటా, జీడిమామిడి, కాఫీ, డ్రాగన్ ఫ్రూట్ పంటలకు హెక్టా్‌ర్‌కు రూ.35వేలు, కూరగాయలు, నర్సరీలకు హెక్టా్‌ర్‌కు రూ.25వేలు ఇవ్వనున్నారు. ఆయిల్ పామ్, కొబ్బరి చెట్లు ఎన్ని నష్టపోయారనేది ఇంకా తేలాల్సి ఉన్నా.. ఒక్కో చెట్టుకు రూ.15వేలు ఇస్తామని ఇప్పటికే సర్కార్ ప్రకటించింది. చేనేత కళాకారులకు -రూ.25వేలు, బోట్లు వలలు దెబ్బతిన్న మత్స్యకారులకు రూ.25వేలు.. చేపల చెరువులకు – రూ.17 వేల చొప్పున పరిహారం అందించనున్నారు. చిన్న దుకాణాలకు రూ.25వేలు, తోపుడు బండ్లకు రూ.20వేలు త్రీ వీలర్స్‌కు రూ.10వేలు, టూవీలర్స్‌కు రూ.3వేలు పరిహారం ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *