Game Changer: ‘గేమ్ ఛేంజర్’కు నేను రాసిన అసలు స్టోరీ ఇదే.. ఇన్నాళ్లకు అసలు విషయం చెప్పిన కార్తీక్ సుబ్బరాజ్ | Karthik subbaraj says story of ram charans game changer movie was changed details inside


‘పెద్ది’ సినిమాకు ముందు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన సినిమా ‘గేమ్ ఛేంజర్’. గతేడాది సంక్రాంతి కానుకగా భారీ అంచనాలతో రిలీజైన ఈ మెగా మూవీ అంచనాలను అందుకోలేకపోయింది. ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను తెరకెక్కించి క్రియేటివ్ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన శంకర్ ఈ గేమ్ ఛేంజర్ సినిమాను తెరకెక్కించడం విశేషం. కాగా ఈ సినిమాకు ప్రముఖ తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు కథ అందించడం గమనార్హం. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూకు హాజరైన ఈ ట్యాలెంటెడ్ డైరెక్టర్ గేమ్ ఛేంజర్ స్టోరీ గురించి సంచలన విషయాలు బయట పెట్టారు. ‘నేను ‘గేమ్ ఛేంజర్’ సినిమా కోసం కథ రాశాను. శంకర్‌కు ఆ కథ నచ్చి, ఆ సినిమాకు స్క్రీన్‌ప్లే కూడా రాయమని నన్ను అడిగారు. కానీ ఆ సమయంలో నేను ‘మహాన్’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉండటంతో స్క్రీన్‌ప్లే రాయలేకపోయాను. జస్ట్ స్టోరీ మాత్రమే అందించాను. నేను ఇచ్చిన కథ ఒక ఐఏఎస్ ఆఫీసర్ చుట్టూ తిరుగుతుంది. ఒక అధికారిగా వ్యవస్థలో మార్పు తీసుకురావడానికి అతను ఎలా ప్రయత్నించాడనేదే ఇందులో ప్రధానాంశం. వాస్తవికతకు దగ్గరగా ఉండేలా ఈ కథను రాశాను’.

“హిందీలో వచ్చిన రాజ్ కుమార్ రాు ‘న్యూటన్’ సినిమా మీకు గుర్తుండే ఉంటుంది. అందులో ఒక ఎన్నికల అధికారి ఓ మారుమూల గ్రామానికి వెళ్తాడు. నా కథ కూడా అలాంటి రియాలిటీ స్పేస్ లోనే ఉంటుంది. అయితే యాక్షన్ పార్ట్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఈ కథలో గ్యాంగ్‌స్టర్ ఎలిమెంట్ కూడా ఉంది. అయితే, రామ్ చరణ్ లాంటి పెద్ద స్టార్ హీరో, శంకర్ లాంటి లెజెండరీ దర్శకుడు, భారీ బడ్జెట్‌తో సినిమా చేస్తున్నప్పుడు కథ స్వరూపం పూర్తిగా మారిపోయిందని నేను భావిస్తున్నాను. ‘గేమ్ ఛేంజర్’ సినిమా చూసినప్పుడు కథ మొత్తం మరో రూపంలోకి మారినట్లు నాకు అనిపించింది. అయినప్పటికీ, శంకర్ లాంటి దిగ్గజ దర్శకుడు నేను రాసిన కథను తీసుకుని సినిమా చేసినందుకు నేను హ్యాపీగా ఉన్నాను’ అని కార్తీక్ సుబ్బరాజు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ డైరెక్టర్ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

‘గేమ్ ఛేంజర్’ సినిమా విషయానికి వస్తే.. అవినీతి రాజకీయ నాయకులకు వ్యతిరేకంగా పోరాడే ఒక ఐఏఎస్ అధికారి కథ. ఈ చిత్రంలో రామ్ చరణ్, కియారా అద్వానీ హీరో, హీరోయిన్లుగా నటించారు. అయితే అవుడేటెడ్ స్టోరీ, వీక్ స్క్రీన్ ప్లే కారణంగా ఈ సినిమా పెద్దగా ఆడలేదు.

ఇవి కూడా చదవండి



మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *