అల్లకల్లోలం.. తీరం దాటిన అర్నబ్ తుఫాన్.. లైవ్ వీడియో


అల్లకల్లోలం.. తీరం దాటిన అర్నబ్ తుఫాన్.. లైవ్ వీడియో

అర్నబ్ తుఫాన్‌ తీరం దాటింది.. యానాం-నరసాపురం మధ్య అర్నబ్ తుఫాన్‌ తీరం దాటింది. దాదాపు 5 గంటలపాటు తీరాన్ని దాటే ప్రక్రియ కొనసాగింది. అర్నబ్ బలహీనపడి తీవ్ర తుఫాన్‌గా మారింది. యానాంకు నైరుతిదిశగా తుఫాన్‌ తీరం దాటింది. తీరం వెంబడి గంటకు 125–135 కి.మీల వేగంతో భీకర గాలులు వీస్తున్నాయి. భారీ వర్షాలతోపాటు.. 150 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కాకినాడ, యానాం ప్రాంతాల్లో ఉప్పెన ముప్పు పొంచి ఉండగా.. సాధారణం కంటే 2.5 మీటర్ల ఎత్తు వరకు అలలు ఎగసిపడే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. తుపాన్ ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి.. అంతా అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ చేశారు. ఈ మేరకు రెడ్ అలర్ట్ జారీ చేశారు.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *