విజయనగరం: ఆర్నబ్ తుఫాన్ ప్రభావంతో విజయనగరం జిల్లాలోని ధర్మపురి గ్రామం జలమయమైంది. వరద నీటిలో ఒకే ఇంటికి చెందిన ఐదుగురు వ్యక్తులు చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న విజయనగరం రూరల్ పోలీసులు వెంటనే రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. డీఎస్పీ ఎస్. లక్ష్మణమూర్తి ఆధ్వర్యంలో పోలీసులు తాళ్లు, జేసీబీ సహాయంతో బాధితులను సురక్షిత ప్రాంతానికి తరలించారు. పోలీసుల సమయస్ఫూర్తితో ఐదుగురికి ప్రాణాపాయం తప్పింది. మరోవైపు, లోతట్టు ప్రాంతాల్లోకి ప్రజలు వెళ్లకుండా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి అప్రమత్తం చేశారు. తుఫాన్ ప్రభావంతో వరద పరిస్థితులు నెలకొన్న ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అధికారుల సూచనలు పాటించాలని పోలీసులు సూచించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
