School Holidays: తుఫాను ఎఫెక్ట్‌.. అక్టోబర్‌ 29న 9 జిల్లాల్లో పాఠశాలలకు సెలవు.. ఎక్కడెక్కడ అంటే..! | Cyclone effect: School Holiday Declared for Schools in 9 Districts on October 29… Which Districts?


School Holiday: ప్రస్తుతం అర్నబ్‌ తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. తీరం దాటిన తుఫాను.. ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుఫాను కారణంగా సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఇప్పటికే తుఫాను కారణంగా ఏపీలోని పలు జిల్లాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. అయితే గురువారం (అక్టోబర్‌ 9)న ఏపీలోని 9 జిల్లాల్లోని పాఠశాలలకు సెలవు ప్రకటించారు అధికారులు.

తుఫాను కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారుల ప్రకటనతో ఈ నిర్ణయం తీసుకున్నాు. అల్లూరి, ఏలూరు, పోలవరం, తూ.గో., ప.గో., కోనసీమ, కృష్ణా, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లోని స్కూళ్లకు సెలవు ఉంటుందని అధికారులు వెల్లడించారు.

అర్నబ్ తుపాను తీరందాటి పలు జిల్లాల్లో అల్లకల్లోలం సృష్టిస్తోంది. కొన్నిజిల్లాల్లో ఈ వర్షాలు, ఈదురుగాలులు కొనసాగుతాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో అత్యంత భారీ వర్షాలు కురుస్తూ వరద పరిస్థితులు ఏర్పడే అవకాశాలున్న జిల్లాల్లో సెలవులను పొడిగించే అవకాశాలున్నాయి.

తెలంగాణలో..

కేవలం ఏపీలోనే కాకుండా తెలంగాణపై కూడా ఈ తుఫాను ప్రభావం ఉంది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ హెచ్చరించింది. దీంతో ముందుజాగ్రత్త చర్యగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని విద్యాసంస్థలకు ఈ రోజు సెలవు ప్రకటించారు.
ఈ అర్నబ్ తుపాను తీరందాటడంతో ఏపీతో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే తెలంగాణ ఏంటే ఏపీలో చాలా జిల్లాల్లో ఈ తుఫాను ప్రభావం ఉంది.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *